ఇరాన్‌లోని భారతీయులకు అడ్వైజరీ
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. రాబోయే 48 గంటలపాటు వారు ఉన్న చోటే ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్ పైఅంతస్తులకు దూరంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంది. అవసరమైతే +989128109115, +989128109102, +989128109109 నెంబర్లను సంప్రదించాలని చెప్పింది.