'పది' పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

'పది' పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ ప్రతీమా సింగ్ ఆదేశాల మేరకు ఆర్డీవో రమాదేవి, ASP మహేందర్ పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. RDO రమాదేవి మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.