క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్

క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్

ASR: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14ఏళ్లలోపు బాలికలకు ఇచ్చే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కొయ్యూరు మండలంలో ప్రారంభించినట్లు రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ స్నేహలత రెడ్డి తెలిపారు. సోమవారం సీహెచ్వో ప్రశాంత్ కుమార్‌తో కలిసి పలువురు బాలికలకు వ్యాక్సిన్లు వేశారు. క్యాన్సర్ బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు.