పదో రోజుకు చేరిన 'టిట్టిభ సత్యాగ్రహం'
VSP: తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండు పిలుపు మేరకు సాగుతున్న "టిట్టిభ సత్యాగ్రహం" బుధవారం నేటికి పదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కవులు, కళాకారులు, భాషాభిమానులు "మాతృభాషా ప్రతిజ్ఞ" చేశారు. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల కోసం మాతృభాషను పణంగా పెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.