గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

HYD: రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో గాయపడినవారిని మంత్రి శ్రీధర్ బాబు గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ విషాదకర ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.