నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు జాబ్ మేళా
ELR: ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ హబ్ ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. ఈ మేళాలో 17 కంపెనీల ప్రతినిధులు పాల్గొని, 1135 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన సోమవారం నూజివీడులో తెలిపారు. టెన్త్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ అర్హతలు ఉన్న యువత పాల్గొనాలని ఆయన కోరారు.