ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం
BDK: ఇల్లందు నియోజకవర్గ బాలాజీ నగర్‌లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ విస్తృతంగా పర్యటించారు. వారు మాట్లాడుతూ.. బాలాజీ నగర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాయం స్రవంతి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.