కార్మికుడి మృతికి నివాళులర్పించిన DCMS మాజీ ఛైర్మన్

BDK: KTPS ఆర్టీజన్ కార్మికుడు పాత పాల్వంచ నివాసి గొట్టుముక్కల కోటేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. పాత పాల్వంచలోని గృహంలో గురువారం వారి మృతదేహాన్ని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.