పత్తి కొనుగోళ్లపై రైతులకు భరోసా
KRNL: సీసీఐకి సంబంధించిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ నిలిచిపోయిందనే రైతుల ఆందోళనపై శనివారం కమర్షియల్ అధికారి శ్రీనివాసులు స్పష్టత ఇచ్చారు. జనవరి 9 వరకు స్లాట్ బుకింగ్లు అందుబాటులో ఉంటాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారి స్పష్టం చేశారు.