'అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి'
BDK: అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు శాఖల వారీగా ప్రగతిని పరిశీలించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.