పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా తమ్మినేని రవి

SKLM: ఆమదాలవలస పురపాలక సంఘం నూతన కమీషనర్ గా తమ్మినేని రవి మంగళవారం భాద్యతలు స్వీకరించారు. ఇంతవరకు పనిచేసిన కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ గత నెల 31వ తేదీన పదవి విరమణ చేసారు. అప్పటి నుండి ఇంచార్జీ కమిషనర్‌గా మున్సిపల్ ఏఈ జాన్సన్ కమిషనర్‌గా వ్యవహరించారు. కమిషనర్‌కి మున్సిపల్ సిబ్బంది అభినందనలు తెలిపారు.