గుర్తు తెలియని మృతదేహం లభ్యం
VKB: బషీరాబాద్ మండలం మంతటి రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాల పక్కన ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసినవారు 8712513854 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.