VIDEO: చింతాలమ్మ ఘాట్‌లో విరిగిపడిన కొండ చరియలు
ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్‌లో గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 516-ఈ హైవే నిర్మాణంలో భాగంగా ఘాట్‌లో రోడ్డు వెడల్పు చేశారు. అయితే అప్పటి నుంచి ఘాట్‌లో ఎప్పటికప్పుడు కొండచరియలు విరిగిపడడం పరిపాటిగా మారింది.