కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

ADB: కలెక్టరేట్ భవనం కూలిన ఘటనపై శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రభుత్వ నిపుణుల కమిటీ బృందం, ఆర్&బీ అధికారులతో కలిసి కూలిపోయిన భవన భాగాలను, మిగతా భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం వినియోగానికి పనికొస్తుందా లేదా అనే విషయంపై సమగ్ర సమీక్ష చేసి, పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.