రాష్ట్రస్థాయి పోటీలకు పోతంగల్ కలాన్ విద్యార్థులు
KMR: గాంధారి మండలం పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భవ్య శ్రీ, సాగరిక, సాయి శృతి, గోపాల్, అన్వేష్ రాష్ట్రస్థాయి U/17 సెపక్ తక్రా పోటీలకు ఎంపికయ్యారు. వీరు డిసెంబర్ 4 నుంచి 6 వరకు మహబూబాబాద్ జిల్లాలోని కురవి AHS(G)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ నాగరాజు తెలిపారు. విద్యార్థులను ప్రధానోపాధ్యా యులు రంగారావు అభినందించారు.