ప్రవహిస్తున్న వాగు.. నిలిచిన రాకపోకలు
NLR: చేజర్ల మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. బ్రిడ్జి పైన సుమారు ఐదు అడుగులు పైన నీరు ప్రవహిస్తుంది. దీంతో సోమవారం అయిదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.