ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిన జూబ్లీహిల్స్

ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిన జూబ్లీహిల్స్

HYD: గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారాలు, వివిధ పార్టీల నాయకుల ఆట, పాటలతో సందడి చేశారు. గల్లీ లీడర్ నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రచారాలతో మారుమోగించారు. కాగా, నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో జూబ్లీహిల్స్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రేపే పోలింగ్ జరగనుండగా రాజకీయ వర్గాల్లో గెలుపెవరిదో అని టెన్షన్ మొదలైంది.