22న ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. 22న ఉదయం 10 గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న మహిళలు ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు ఆలయ కార్యాలయంలో పేరు, చిరునామా నమోదు చేసి, ఆధార్ జిరాక్స్ సమర్పించాలని సూచించారు.