'ఎన్నికల నిర్వహణకు సహకరించాలి'

'ఎన్నికల నిర్వహణకు సహకరించాలి'

KMR: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సదాశివ నగర్ సీఐ సంతోష్ సూచించారు .శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని చెప్పారు.