'జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'
ADB: ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు అన్నదాతకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.