VIDEO: డ్రోన్ కి చిక్కిన జూదరులు

కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యకలాపాలపై కళ్లెం వేస్తున్నారు. శుక్రవారం గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మందపాడు గ్రామంలో పచ్చటి పొలాల మధ్య పేకాట ఆడుతున్న ఇద్దరిని డ్రోన్ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ఇలాంటి జూద కార్యకలాపాలను డేగ కన్నుతో పసిగడతామని పోలీసులు హెచ్చరించారు.