IPL బెట్టింగ్.. నిందితుడి కోసం ముమ్మర గాలింపు

IPL బెట్టింగ్.. నిందితుడి కోసం ముమ్మర గాలింపు

కృష్ణా: విజయవాడ నుంచి అవనిగడ్డ కేంద్రంగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరి లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తూ వారి సెల్ ఫోన్‌లు సీజ్ చేసి సాంకేతిక విశ్లేషణ చేపడుతున్నారు.