తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షుడి ఎన్నిక
SRPT: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షుడిగా కొల్లూరి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఆయనకు ఈరోజు కోదాడలో నియామక పత్రం అందజేశారు. ఉద్యమకారులందరినీ ఐక్యం చేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రమేష్ సూచించారు. కొత్త కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.