దగదర్తి డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

దగదర్తి డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

నెల్లూరు జిల్లా దగదర్తి డిప్యూటీ తహసీల్దార్ పాలకృష్ణపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరులో జీ+3 బిల్డింగ్, చేజర్ల మండలంలో 5.59 ఎకరాల భూమి, పొదలకూరులో సైట్, 395గ్రా బంగారం, లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ కోట్లలో ఉంటుంది.