ఆదర్శప్రాయుడు చిట్టబత్తిని సుబ్బరామయ్య
SRPT: కోదాడ పట్టణ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. మంగళవారం సుబ్బరామయ్య 16వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.