నేడు కెరమెరి మండలంలో విద్యుత్ అంతరాయం

కొమురంభీం: జిల్లాలోని కెరమెరి మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 33/11వీ విద్యుత్ లైన్లో సాంకేతిక సమస్యల దృష్ట్యా మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున వినియోగదారులు గమనించి అంతరాయనికి సహకరించాలని కోరారు.