ప్రతిపక్ష కూటమి భారీ ర్యాలీ
మహారాష్ట్రలో 'సత్యం కోసం పాదయాత్ర' పేరిట ప్రతిపక్ష కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఇతర రాష్ట్రాల వారిని చేరుస్తూ.. అసలు ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించింది. ఈ అక్రమాలు బీజేపీ గెలుపు కోసం సహాయం చేస్తున్నాయని మండిపడింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దిన తర్వాతే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.