దేవస్థానానికి అన్నదానం ట్రాలీలు వితరణ
కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానశాలకు కోడూరు భక్తులు సిద్దినేని వంశీ మణికంఠ, సాయి లక్ష్మి ప్రసన్న కుటుంబ సభ్యులు అన్నదానం ట్రాలీలను బహుకరించారు. సోమవారం దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. ఈ మేరకు దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.