'చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి'
HYD: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఏ, పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య బుధవారం నాయకులతో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు.