మద్యం ప్రస్తావన.. జానారెడ్డి కీలక వాఖ్యలు

NLG: పెద్దవూర మండలంలో మాజీ మంత్రి జానారెడ్డి ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయోభారంతో తాను విశ్రాంతి తీసుకుంటున్నానని, తన ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న తన కుమారులతో కలిసి అభివృద్ధిలో భాగస్వాముడిని అవుతానన్నారు. వారంలో రెండు రోజులు మద్యం తాగడం బంద్ చేసి ఆ డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని పలు గ్రామాల ప్రజలకు సూచించారు.