గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి
అన్నమయ్య: గ్రామీణ రోడ్లు నిర్మాణానికి 4.64 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం మాధవరంలో మండల టీడీపీ క్లస్టర్ కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు కసినేని వీరమల్లు నాయుడు, మనోహర్, పేయల జయ, మల్లికార్జున ఉన్నారు.