భగవద్గీత శ్లోకాలతో మారు మ్రోగిన ఆలయ ప్రాంగణం

భగవద్గీత శ్లోకాలతో మారు మ్రోగిన ఆలయ ప్రాంగణం

RR: గీతాజయంతి సందర్భంగా చేవెళ్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గీతాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ, విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి, సేవికా సమితి సభ్యులు సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో హోమం నిర్వహించగా, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. సర్వ సమస్యలకు పరిష్కారం చూపించేది కేవలం జగద్గురువు భగవద్గీత అని పలువురు కొనియాడారు.