నాదెండ్లలో 'పిల్లలు బడికి-పెద్దలు పనికి' కార్యక్రమం

నాదెండ్లలో 'పిల్లలు బడికి-పెద్దలు పనికి' కార్యక్రమం

PLD: నాదెండ్ల జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 'పిల్లలు బడికి-పెద్దలు పనికి' అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీ ఎంతో ప్రభావవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు నిర్మల పాల్గొని విద్యార్థుల చైతన్యానికి మద్దతు తెలిపారు. పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, అలాగే పెద్దలు తమ సామాజిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.