VIDEO: దేవనకొండలో ఎరువులను పంపిణీ చేసిన AEO
KRNL: దేవనకొండలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 300 ఎరువుల బస్తాలు సిద్ధం చేశామని ఏఈఓ సలాం బాషా అన్నారు. రైతులు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఎరువుల బస్తాలు పొందవచ్చని చెప్పారు. సబ్సిడీతో ఒక్కో బస్తా ధర రూ. 266.50గా నిర్ణయించామని పేర్కొన్నారు. సాగు పనులు నిరంతరాయంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు.