'ఆ కుంభకోణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది'
TG: మంత్రి పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పొంగులేటిపై విమర్శలు చేయడం కాదు ఆధారాలు ఉంటే గాంధీ భవన్‍కు వచ్చి ఇవ్వాలన్నారు. నాదర్‍గుల్ భూముల కుంభకోణం బీఆర్ఎస్ హయంలోనే జరిగిందని ఆరోపించారు. తమ మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. BRS దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు.