ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
VSP: భీమిలి సింగన్న బండ గ్రామంలో ఇవాళ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లేడు ద్రావణం తయారీ, వ్యవసాయంలో దాని ఉపయోగాలపై రైతులకు వివరించారు. చీడపీడల నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని, వరి, అరటి, పత్తి పంటల్లో మంచి ఫలితాలు ఇస్తుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి శ్యామల తెలిపారు.