VIDEO: 'చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి'

ASR: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఉమెన్ పీఎస్ డీఎస్పీ వేణుగోపాల్ విద్యార్థులకు సూచించారు. బుధవారం చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో సమావేశమయ్యారు. గ్రామాలకు వెళ్లినప్పుడు గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై తల్లిదండ్రులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు ఆత్మన్యూనతా భావానికి దూరంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలన్నారు.