BREAKING: కూకట్ పల్లిలోని ఓ మాల్లో ప్రమాదం

BREAKING: కూకట్ పల్లిలోని ఓ మాల్లో ప్రమాదం

HYD: కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఓ మాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మాల్‌ను సందర్శించడానికి వచ్చిన వినియోగదారులపై అకస్మాత్తుగా సీలింగ్ బోర్డులు కుప్పకూలాయి. ఆదివారం కావడంతో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.