మెటాకు AI గాడ్ ఫాదర్ గుడ్‌బై!

మెటాకు AI గాడ్ ఫాదర్ గుడ్‌బై!

ఆధునిక AI గాఢ్ ఫాదర్‌ల్లో ఒకరైన కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా నుంచి తప్పుకున్నారు. తన సొంత AI స్టార్టప్‌ను ప్రారంభించేందుకు మెటాకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టారు. 12 ఏళ్ల తర్వాత తాను మెటాను విడిచిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా, లెకున్ 2013లో మెటాలో వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు.