'ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు'
KKD: రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యాన్ని అమ్మకాలు సాగించద్దని పిఠాపురం అగ్రికల్చర్ ఏడీ స్వాతి తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 44 ధాన్యం కొలువులు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 17% ధాన్యంలో తేమశాతం ఉన్నట్లయితే 75 కేజీలు బస్తాకు రూ.1,777, ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీలకు రూ. 1,792 చెల్లిస్తామని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర లేకుండా అమ్మకాలు సాగించవద్దని సూచించారు.