అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే

అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే

Akp: మాడుగుల, చీడికాడ మండలాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లోని అంగన్వాడీలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో సామ్సంగ్ సెల్ ఫోన్స్ పంపిణీ చేశారు. ఈ ఫోన్ల ద్వారా కార్యకర్తలు చిన్నారులు, బాలింతలు, గర్భవతుల సంక్షేమ పథకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగలరు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారామ్ సహా అధికారులు పాల్గొన్నారు.