శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్

VZM: రేపు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని ఆచరణ, నీతి, ధర్మబద్ధమైన జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌహార్దం, సత్యనిష్ఠ పెంపొందించడానికి శ్రీరాముని జీవితం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.