రుద్రారంలో రోడ్డు భద్రతపై అవగాహన
MBNR: నవాబుపేట మండలంలోని రుద్రారం రైతు వేదికలో పోలీసులు సోమవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ జానకి మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఎస్సై విక్రం, సర్పంచ్ రవి, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.