డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్

NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా రూ. 5 లక్షలు సమకూర్చారు. ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ నెలకొల్పారు.