టీడీపీలో చేరిన వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ పోతిరెడ్డి రాజారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తన అనుచరులతో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర వైసీపీ కౌన్సిలర్ రాజారెడ్డితోపాటు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.