బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మేము సైతం
BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో మహబూబి అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి సభ్యులు మహబూబీ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. సభ్యులు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి మా వంతుగా సహాయం అందిస్తూనే ఉంటామని తెలిపారు.