ఎస్పీ కార్యాలయంలో సర్దార్ జయంతి వేడుకలు
SKLM: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని, రాష్ట్రీయ ఏక్తా దివాస్లో భాగంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ రమణ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత, ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.