VIDEO: శ్రీకాకుళంలో నిప్పుల ఎండ
శ్రీకాకుళం నగరంలో గ్రీష్మ తాపం తీవ్రమవుతోంది. ఇందులో భాగంగా గురువారం భానుడు చండ్ర నిప్పులు చెరిగాడు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఎండ వేడికి రోడ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వడ గాడ్పులకు భయపడి చాలామంది ఇళ్లకు పరిమితo అయ్యారు. విపత్తు నిర్వహణ సంస్థ జిల్లాలో రానున్న 48 గంటల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరవచ్చని తెలిపింది.