'బొబ్బిలి నియోజకవర్గాన్ని మన్యం జిల్లాలో కలపండి'

VZM: బొబ్బిలి నియోజకవర్గాన్నిదగ్గరగా ఉన్న మన్యం జిల్లాలో కలపకుండా, దూరంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉంచడం అన్యాయమని CPI, CPI(M), BJP, కాంగ్రెస్, ప్రజాసంఘాలు విమర్శించారు. ఈ మేరకు ఇవాళ బొబ్బిలిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని మన్యం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రజల సౌకర్యం కోసమే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.