24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన అధికారులు
ATP: శ్రీరామిరెడ్డి జలాల సమస్యను MLA అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లిన 24 గంటల్లోపే పరిష్కారమైంది. కొత్తూరు గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే పర్యటించగా నీటి సమస్యను మహిళలు ఆయనకు తెలిపారు. వెంటనే అధికారులతో మాట్లాడి శ్రీరామిరెడ్డి నీటిని విడుదల చేయించారు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.